Thursday, July 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శాస్త్రీయ నైపుణ్యంతో విద్యార్థులు జ్ఞానం పెంపొందించాలి

శాస్త్రీయ నైపుణ్యంతో విద్యార్థులు జ్ఞానం పెంపొందించాలి

- Advertisement -

– రూ.1.50 లక్షల విలువైన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ అందజేసిన ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి
– ప్రారంభించిన ఎంఈఓ రాజగోపాల్ రెడ్డి
నవతెలంగాణ – రాయపోల్ 

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించేందుకు డిజిటల్ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించాలని రాయపోల్ మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం రాయపోల్ మండలం బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి తన సొంత వ్యయంతో రూ.1.50 లక్షల విలువైన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్  ను సైన్స్ ల్యాబ్‌కు అందజేశారు. ఎంఈఓ రాజగోపాల్ రెడ్డి ఆ ప్యానల్‌ను ప్రారంభించి విద్యార్థులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు సంప్రదాయ బోధనతో పాటు డిజిటల్ స్కిల్స్ కూడా అత్యంత అవసరమని అన్నారు. శాస్త్ర విజ్ఞానాన్ని సులభంగా అర్థం చేసుకునేలా, ప్రయోగాత్మక అభ్యాసాన్ని ప్రోత్సహించేలా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ ఉపయోగపడుతుందని తెలిపారు.

డిజిటల్ బోధన ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలు మరింత పెంపొందుతాయని పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆధునిక సాంకేతిక పరికరాన్ని అందించిన ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు భాస్కర్ రెడ్డి సేవాభావం ఇతర ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తుందని ఎంఈఓ కొనియాడారు.ఈ కార్యక్రమంలో బేగంపేట గ్రామ సర్పంచ్ గీతా ప్రవీణ్, ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల, ఉపాధ్యాయులు నవీన్, నర్సింలు గౌడ్, సంజీవ్, ప్రభాకర్, దివాకర్, రాజేంద్ర, అమరేందర్, కమలాకర్, ప్రసాద్, వసంత, పావని, సీఆర్‌పీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -