Friday, July 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజ్వల్ ఇండస్ట్రీస్ రైస్ మిల్‌పై విజిలెన్స్ విస్తృత తనిఖీలు

ప్రజ్వల్ ఇండస్ట్రీస్ రైస్ మిల్‌పై విజిలెన్స్ విస్తృత తనిఖీలు

- Advertisement -

నవతెలంగాణ – కేసముద్రం
మండల పరిధిలోని కోరుకొండ పల్లి శివారులో ఉన్న ప్రజ్వల్ ఇండస్ట్రీస్ రైస్ మిల్‌లో విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ డీఎస్పీ మల్లయ్య ఆధ్వర్యంలోని బృందం మిల్లులోని రికార్డులు, ధాన్యం నిల్వలు, బియ్యం నిల్వలు, నిర్వహణ విధానాలను పరిశీలించింది. తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారులు గుర్తించిన అంశాలు, ఏవైనా అవకతవకలు వెలుగులోకి వచ్చాయా అనే విషయాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. దీనిపై విజిలెన్స్ శాఖ నుంచి పూర్తి సమాచారం వెలువడిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -