నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లను, ఆలేరు మున్సిపల్ సిబ్బంది తొలగించడన్ని నిరసిస్తూ ,బస్టాండ్ వద్ద గంటపాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ అధికార పార్టీకి తొత్తుగా మారి, ఫ్లెక్సీ లను తొలగిస్తున్నారని అన్నారు. ఆలేరులో ఎప్పుడు లేని విదంగా అధికార పార్టీకి తలోగ్గి మా ఫ్లెక్సీ లు తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆర్టీఏ మెంబర్ పంతం కృష్ణ, కౌన్సిలర్ పూల శివ, మాజీ వార్డు మెంబర్ జింకల రామకృష్ణ యాదవ్, బీజని మధు కుమార్, పాకాల హరీష్, బింగి రవి, బేతి రాములు, రామనర్సయ్య,పూల శ్రవణ్,మాదిశెట్టి హెమెందర్, ఎండీ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ ప్లెక్సీ తొలగించారని రాస్తారోకో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



