Saturday, July 25, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిప్రశ్నించాల్సిందే..?

ప్రశ్నించాల్సిందే..?

- Advertisement -

ఈరోజు మన దేశం ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశంలో పాలకవర్గాల భావాలే ప్రజల భావాలుగా ఉండాలని ఒత్తిడి పెరుగుతోంది. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినా, విమర్శించినా వెంటనే ‘దేశద్రోహి’ అనే ముద్ర వేస్తున్నది. ఇది రోజురోజుకూ ప్రమాదకరమైన ధోరణిగా మారుతోంది. నేడు అనేక సమస్యలపై ప్రజలు ఉద్యమిస్తున్నారు. నీట్‌ ‌వంటి పేపర్‌ ‌లీకేజీలతో తమ భవిష్యత్తు నాశనమవుతోందని విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. కనీస వేతనం, ఉపాధి కోసం కార్మికులు ఉద్యమిస్తున్నారు. గిట్టుబాటు ధర కోసం రైతులు పోరాడుతున్నారు. పాలకవర్గాలు అనుసరి స్తున్న నయా ఉదార విధానాల వల్లే కదా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. వీరందరి సమస్యలు పరిష్కరించి ప్రజలెన్నుకున్న ప్రభుత్వమే కదా? ప్రశ్నించకూడదు, విమర్శించకూడదు అంటే ఎలా? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరం కాదు, అది ప్రజల రాజ్యాంగబద్ధమైన హక్కు. దాన్ని పాలకులు విస్మరిస్తే ఎలా? అధికారంలో ఉన్నవారు అన్ని మతాలను గౌరవించా ల్సింది పోయి ఒకే మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉప యోగించి, మెజారిటీ-మైనారిటీ ప్రజల మధ్య విద్వేషాలను పెంచుతున్నారు.

కులాల పేరుతో, మతాల పేరుతో విభజన ఇంకెంతకాలం? ఇది ఎల్లకాలం సాగదు.మతోన్మాద ఘటనలను ప్రశ్నించిన వారిని ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు అంటూ దేశద్రోహులుగా చిత్రీకరించడం ప్రజాస్వామ్యానికి మేలు చేయదు. భిన్నాభి ప్రాయం వ్యక్తం చేసిన పండితులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు కూడా దాడులకు గురవుతున్న ఘటనలు ప్రజాస్వామ్యానికి ఆందోళన కలిగించే అంశాలు. దేశంలో స్వతంత్రంగా పనిచేయాల్సిన సీబీఐ, ఈడీ, ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ వంటి రాజ్యాంగ సంస్థలు పూర్తిగా నిష్పాక్షికంగా, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా పనిచేయాలి. ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడాలంటే ఈ సంస్థల స్వతంత్రత అవసరం. వీటిని స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగిస్తున్న కేంద్రసర్కార్‌ ప్రజల్ని కూడా బందీగా చేయాలనుకుంటున్నది. ఇది దేశానికి మరో ప్రమాదకరం.

మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, ప్రశ్నించే హక్కును కల్పించింది. ప్రభుత్వం నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల కష్టాలు, కార్మికుల హక్కులు, విద్య, వైద్యం వంటి సమస్యలకు పరిష్కారాలు చూపడం లేదు. ప్రజలను మతం, కులం పేరుతో విడగొట్టే రాజకీయాలను చేస్తున్నది. ఇదంతా దేశం గమ నిస్తూనే ఉంది. ప్రజాస్వామ్యంలో చివరి తీర్పు ప్రజలదే. ఎన్నికల ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేసే ఏ ప్రభుత్వానికైనా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే తగిన సమాధానం చెబుతారు. అందుకే భారత రాజ్యాం గాన్ని, లౌకికవాదాన్ని, ప్రజాస్వా మ్యాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. మత విద్వేషాలకు, ద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలి. కార్మికులు, రైతులు, యువత, మహిళలు కలిసి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -