వాహనంపై దొర్లిపడిన బండరాళ్లు..
నవజాత శిశువు సహా 13మంది మృతి
సిమ్లా : వేగంగా వెళుతున్న ఎస్‌యువి వాహనంపై పెద్ద బండరాళ్లు దొర్లిపడటంతో 13మంది మరణించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహౌల్ -స్పితి జిల్లాలో ఉదయ్‌పూర్-పాంగి రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఆరునెలల నవజాత శిశువు కూడా ఉంది. వివరాల ప్రకారం.. 15మంది ప్రయాణికులతో కుల్లు నుంచి కిల్లార్‌కి వెళుతున్న ఎస్‌యూవీపై బండరాయి దొర్లిపడటంతో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. బండరాయి ఢీకొన్న ధాటికి కారు వెనుక భాగంలో మంటలు చెలరే గాయి. స్థానికుల సాయంతో ఆర్మీ మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. అయితే అప్పటికే వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 13మంది మరణించారు. మరో ఇద్దరు వాహనం నుంచి దూకేయడంతో ప్రాణాలతో బయటపడ్డారని లాహౌల్-స్పితి డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, గురువారం ఉదయ్‌పూర్-కిల్లార్ రహదారి మూసివేయబడటంతో వారు టిండి వద్ద చిక్కుకుపోయారు. రహదారి తిరిగి తెరుచుకున్న తర్వాత శుక్రవారం పాంగికి బయలుదేరారు, కానీ వారి వాహనం ప్రమాదానికి గురవడంతో ప్రాణాలు కోల్పోయారు. మృతుల వివరాలు తెలియాల్సి వుంది.
హిమాచల్ ప్రదేశ్ లో ఘోరం
- Advertisement -
- Advertisement -



