నవతెలంగాణ – మునిపల్లి
పాఠశాల స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని మునిపల్లి మండల విద్యాధికారి భీంసింగ్ పేర్కొన్నారు. రెండవ విడత మూడు రోజుల ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. వృత్యంతర శిక్షణా తరగతుల్లో నేర్చుకున్న బోధనా మెలకువలు నైపుణ్యాలను పాఠశాల స్థాయిలో ఉపయోగించి ఆశించిన లక్ష్యసాధనకు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు మేకల అనురాధ గణితం బోధన మెళకువలు పద్ధతులపై తయారుచేసిన ఆసక్తికర బోధన నైపుణ్యాల నమూనాలను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించి ఉపాధ్యాయురాలు మేకల అనురాధను మండల విద్యాధికారి భీంసింగ్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మండల రిసోర్స్ పర్సన్ లు సంతోషమ్మ అనురాధ,సాయిలు ఉమారాణి, మండల వనరుల కేంద్ర సిబ్బంది విఠల్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.
లక్ష్య సాధనకు కృషి చేయాలి: ఎంఈఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



