Saturday, July 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులపై లాఠీచార్జ్ దుర్మార్గపు చర్య.!

విద్యార్థులపై లాఠీచార్జ్ దుర్మార్గపు చర్య.!

- Advertisement -

ఆర్టీఐ జిల్లా కన్వీనర్ చార్లీ వెంకటేశ్వర్లు గౌడ్,కొకన్వీనర్ కుమార్ యాదవ్..
నవతెలంగాణ – మల్హర్ రావు

నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం లాఠీచార్జి చేయించడం దుర్మార్గపు చర్యని యునైటెడ్ పోర్ పర్ ఆర్టీఐ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, కోకన్వీనర్ చింతల కుమార్ యాదవ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో వారు మాట్లాడారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీతో దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిర్బంధాలతో వారిని అణచివేస్తోందని ఆరోపించారు. విద్యార్థులకు మద్దతిస్తున్న ప్రతిపక్ష పార్టీలపై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై టియర్ గ్యాస్ ప్రయోగించడం, లాఠీచార్జి చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్దామన్నారు. విద్యార్థుల గొంతును అణిచివేసే చర్యలు ప్రజాస్వామ్య ప్రభుత్వానికి తగవన్నారు. అణిచివేతతో కాకుండా చర్చల ద్వారా సమస్యలు పరిస్కారం చేయాలన్నారు. గాయపడిన విద్యార్థులకు తక్షణ వైద్యసాయం అందించి, బాద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -