Monday, July 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్స్ బుక్స్ పంపిణీ

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్స్ బుక్స్ పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
పరకాల పట్టణంలోని దళితవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (పీఎస్)తో పాటు దళితవాడ న్యూ పాఠశాలలో ఆదివారం ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్స్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి బొచ్చు సజీవన్ నోట్స్ బుక్స్‌ను బహుమతిగా అందించారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా ముందుండి పోరాటం చేస్తామని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులతో పాటు తమ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్, జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ హేమంత్, ప్రభుత్వ కళాశాల అధ్యక్షుడు దోమ్మటి విశ్వంత్, కమలాకర్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -