Monday, July 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎర్రబెల్లిగూడెంలో ఉచిత వైద్య శిబిరం 

ఎర్రబెల్లిగూడెంలో ఉచిత వైద్య శిబిరం 

- Advertisement -

నవతెలంగాణ-నెల్లికుదురు 
మండలంలోని ఎర్రబెల్లి గూడెం గ్రామంలో మెడికేర్ హాస్పిటల్ వారి సహకారంతో బాలవికాస మెయిన్ కోఆర్డినేటర్ ఎం రామ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని ఆ గ్రామ ఉప సర్పంచ్ జిలకర సాంబమూర్తి అన్నారు. సోమవారం 140 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో మారుమూల ప్రాంతమైన ఎర్రబెల్లి గూడెం గ్రామంలో ప్రజల బాగోగుల క్షేమం కోసం ఉచితంగా బాలవికాస వారు క్యాంపు ఏర్పాటు చేసి మందులను అందించడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి క్యాంపులు మళ్లీ పెట్టి పేద వాళ్ళని ఆదుకోవాలని చెప్పారు. ఈ క్యాంపులో బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి ప్రజలకు ఎంతో మేలు చేశారని అన్నారు. ఈ సీజన్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఈ సందర్భంగా కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నరేష్ , మేనేజ్మెంట్ యన్ రాము , యన్ వెంకటమ్మ , సిబ్బంది కీర్తి శిరీష బాల వికాస మెయిన్ కోఆర్డినేటర్ ఎం రమ,కో ఆర్డినేటర్ ఏం సరిత,కారోబార్ రాములు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -