Wednesday, March 18, 2026
E-PAPER
HomeNewsసర్వీసు రోడ్డు లేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి

సర్వీసు రోడ్డు లేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి

- Advertisement -

 నవతెలంగాణ-డిచ్ పల్లి 
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో మూడవ రోజు బుధవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి పలు అంశాలపై ప్రస్తావించారు. రోడ్లు భవనాల శాఖ కు సంబంధించి 44 వ నంబర్ జాతీయ రహదారి దాదాపు 50 కిలోమీటర్లు తన నియోజకవర్గం గుండా వెళ్తుందని.. ఈ నేపథ్యంలో రోడ్డుకు ఇరువైపులా సర్వీసు రోడ్డు లేక తరచు పెద్ద స్థాయిలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సుమారు 15 గ్రామాలకు చంద్రయాన్ పల్లి,గన్నారం, 7వ బెటాలియన్, డిచ్ పల్లి, సుద్దపల్లి తదితర గ్రామాలకు జాతీయ రహదారి విస్తరించి ఉన్నందున ఆయా గ్రామాల వద్ద సర్వీసు రోడ్డు, సబ్ వే నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఇదివరకే జాతీయ రహదారి అధికారులతో చర్చించినప్పటికి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. అతివేగం కారణంగా రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య పెరుగు తుందన్నారు. కావున సంబంధింత శాఖ మంత్రి ప్రత్యేక దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన సంబంధింత మంత్రులు వాటి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -