ప్రపంచ చెల్లింపులలో యువాన్‌ వాటా పైపైకి..

The Yuan in Global Payments Stake up..–  నాలుగో స్థానానికి ఎగబాకింది..గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ మెస్సేజింగ్‌ సర్వీస్‌ ”స్విఫ్ట్‌” డేటా
2023 నవంబర్‌ నెలలో ప్రపంచ చెల్లింపులలో క్రియాశీలంగా ఉపయోగిస్తున్న కరెన్సీలలో చైనీస్‌ యువాన్‌ నాలుగవ స్థానానికి ఎగబాకిందని గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ మెస్సేజింగ్‌ సర్వీస్‌ ”స్విఫ్ట్‌” సేకరించిన డేటా సూచిస్తోంది. ఈ వారంలో స్విఫ్ట్‌ విడుదలచేసిన నివేదిక ప్రకారం చైనీస్‌ యువాన్‌ ను 4.61శాతం లావాదేవీలలో వినియోగించారు. అక్టోబర్‌ నెలలో ఇది 3.60శాతంగా ఉండి 3.91శాతం నుంచి 3.41శాతానికి దిగజారిన జాపనీస్‌ యెన్‌ వాటాను అధిగమించింది. మొత్తంమీద యువాన్‌ చెల్లింపుల విలువ అక్టోబర్‌ తో పోల్చినప్పుడు 34.87శాతం పెరిగింది. 2022 నవంబర్‌ నుంచి వార్షికంగా చూచినప్పుడు 2.37శాతంగావున్న యువాన్‌ గ్లోబల్‌ షేర్‌ దాదాపు రెండింతలు అయింది.
నవంబర్‌ నెలలో ప్రపంచంలోని టాప్‌ కరెన్సీల వాటా క్షీణించింది. అమెరికన్‌ డాలర్‌ వాటా అక్టోబర్‌ లో 47.25శాతంవుండగా నవంబర్‌ కల్లా అది 47.08శాతానికి పడిపోయింది. యూరో వాటా 23.36శాతం నుంచి 22.95శాతానికి, బ్రిటీష్‌ పౌండ్‌ వాటా 7.33శాతం నుంచి 7.15శాతానికి పడిపోయాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో చైనా యువాన్‌ వాటా పెరగటం డాలర్‌ నుంచి తాను దూరమవటాన్ని, తన కరెన్సీని చైనా ప్రమోట్‌ చేయటాన్ని సూచిస్తోందని స్విప్ట్‌ నివేదిక తెలుపుతోంది. రష్యా, మధ్యప్రాచ్చ, దక్షిణ అమెరికా దేశాల వాణిజ్యంలో తన కరెన్సీలో లావాదేవీలు జరిగేలా చైనా ప్రోత్సహిస్తోందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు.

Spread the love