Tuesday, July 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపెద్దికి మెరుగైన వైద్యం అందించండి

పెద్దికి మెరుగైన వైద్యం అందించండి

- Advertisement -

డాక్టర్లతో మాజీ సీఎం కేసీఆర్‌
యశోద ఆస్పత్రిలో 
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
కుటుంబసభ్యులకు పరామర్శ

నవతెలంగాణ-బేగంపేట
​మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. ​తీవ్రమైన గుండెపోటుతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని, చికిత్స వివరాలను కేసీఆర్‌ ‌తెలుసుకున్నారు. సోమవారం ఆయన ఆస్పత్రికి వచ్చారు. ఐసీయూ వార్డులో పెద్దికి అందుతున్న చికిత్స విధానాన్ని పరిశీలించారు. ​డాక్టర్లతో మాట్లాడారు. ‘ఏం చేస్తారో చేయండి.. కానీ ఎలాగైనా మా పెద్దిని కాపాడండి’’ అని కోరారు. దాంతో పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రపంచ స్థాయి అత్యుత్తమ చికిత్సను అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు.​ గుండె ఊపిరితిత్తుల పనితీరు బాగానే ఉన్నప్పటికీ మెదడు పనితీరు సరిగా లేనందున మంగళవారం లేదా బుధవారం ఎమ్మారై సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. అయితే అమెరికా, యూకే సహా ఇతర దేశాల్లో ఉన్న నిపుణులతోనూ చర్చించి మెరుగైన వైద్య చికిత్స అందజేయాలని కేసీఆర్ యశోద వైద్యులకు చేతులెత్తి నమస్కరించారు.
అనంతరం పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డి కుటుంబ సభ్యుల వద్దకు చేరుకున్న కేసీఆర్, వారికి భరోసాను, ధైర్యాన్ని అందించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు యశోద వైద్యులు చెప్పినట్టు తెలిపారు. డాక్టర్ల కృషితో, దేవుని దయతో, ప్రజల ఆశీర్వాదంతో ఆయన కోలుకుంటాడని కేసీఆర్ విశ్వాసాన్ని ప్రకటించారు. ఖర్చుకు వెనకాడకుండా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడుకోవడానికి పార్టీ శాయశక్తులా కృషి చేస్తుందని స్పష్టం చేశారు. అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తామని కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చారు.

​పరామర్శించిన సీతక్క, కేటీఆర్‌
మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క), బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌‌రావు యశోద ఆస్పత్రికి చేరుకుని పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. డాక్టర్లతో మాట్లాడి పెద్ది ఆరోగ్య పరిస్థితిని, చికిత్స వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. పరామర్శించిన వారిలో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -