- Advertisement -
నవతెలంగాణ – సదాశివనగర్ : సదాశివ నగర్ మండలంలో విబిజి రామ్ జి పథకంలో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లకు గత మూడు నెలల నుండి వేతనాలు రావడం లేదు. ఈ యొక్క మూడు నెలల పెండింగ్ వేతనాలు ఇప్పించగలరని మరియు విబిజి రాంజీ పథకంలో ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు అందే విధంగా పై అధికారులకు తెలియజేయాలని మండల ఎంపీడీవో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మాలోత్ దేవి సింగ్, రఘునాథరావు, పొన్న నర్సింలు, క్యామ పుష్పాంజలి, ఎం నరస గౌడ్ రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది.
- Advertisement -


