నవతెలంగాణ – కామారెడ్డి: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు – 2026 కోసం అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంచాలకుల ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, పాఠశాల సహాయ ఉపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, తత్సమాన కేడర్ ఉపాధ్యాయులు, స్నాతకోత్తర ఉపాధ్యాయులు, శిక్షణ పొందిన స్నాతక ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నిర్దేశించిన దరఖాస్తు నమూనాలను సంబంధిత మండల విద్యాధికారి కార్యాలయాల నుంచి పొందాలని సూచించారు. పూర్తిగా నింపిన దరఖాస్తులతో పాటు అవసరమైన ధ్రువపత్రాల రెండు సెట్లను ఆగస్టు 10, 2026లోగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం, కామారెడ్డిలో తప్పనిసరిగా సమర్పించాలని అయన ఆ ప్రకటనలో కోరారు.
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



