Thursday, July 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విశ్వవిద్యాలయాల అభివృద్ధిలో బోధనేతర ఉద్యోగుల పాత్ర కీలకం

విశ్వవిద్యాలయాల అభివృద్ధిలో బోధనేతర ఉద్యోగుల పాత్ర కీలకం

- Advertisement -


– రిజిస్ట్రార్ డా. యల్. విజయా కృష్ణా రెడ్డి
– అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో తుంటియా మొదటి కార్యనిర్వాహక సమావేశం

నవతెలంగాణ – ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాల బోధనేతర సంఘం (తుంటియా), డా.బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బోధనేతర ఉద్యోగుల సంఘంఅధ్వర్యంలో మొదటి కార్యనిర్వాహక సమావేశాన్ని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించారు.ఈ సమావేశానికి అంబేద్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా.ఎల్. విజయా కృష్ణా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల అభివృద్ధిలో బోధనేతర ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన పరిపాలనా సేవలను అందించడంలో వారి సేవలు కీలకమన్నారు. ఉద్యోగులు పరస్పర సహకారం, సమన్వయంతో పనిచేస్తూ విశ్వవిద్యాలయాల అభివృద్ధికి తోడ్పడాలని ఆయన సూచించారు.

రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల బోధనేతర ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంక్షేమం, సేవా అంశాలపై ఉమ్మడి వేదికగా ఈ సంఘం పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణతో పాటు బాధ్యతాయుతమైన సేవా దృక్పథంతో విధులు నిర్వహించడం ద్వారా ఉన్నత విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.ఈ సమావేశంలో తెలంగాణ విశ్వవిద్యాలయాల బోధనేతర ఉద్యోగుల ప్రతినిధులు, సంఘం రాష్ట్ర మరియు విశ్వవిద్యాలయాల నాయకులు పాల్గొని ఉద్యోగుల సంక్షేమం, సేవా నిబంధనలు, పరిపాలనా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. కార్యక్రంలో తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాల బోధనేతర సంఘం (TUNTEA) అధ్యక్షులు అబ్దుల్ ఖదీర్ ఖాన్; సెక్రటరీ జనరల్ కె. ప్రేమ్ కుమార్; జనరల్ సెక్రెటరీగా జయరాం; గౌరవ అధ్యక్షుడిగా శ్రీనివాస్ యాదవ్, ఆ సంఘం మాజీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, వెంకట్ ,ఖదీర్ ఖాన్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన నాన్-టీచింగ్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -