నవతెలంగాణ – ఉస్మానియా యూనివర్సిటీ : RSP ప్రశ్నలపై ప్రభుత్వం తీరు – చర్చ కార్యక్రమం- డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెమినార్ హల్ లో రౌండ్ టేబుల్ సమావేశo విద్యార్థి జేఏసీ నేత డా.రుద్రవరం సునీల్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ సమావేశం SSU అధ్యక్షులు మొగిలి పాక నవీన్ అధ్యక్షతన, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.డా.ఆర్ ఎస్పీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, వారిని మానసికంగా కుంగదీయాలని ఉద్దేశం తో ఇలాంటి కుట్రపూరిత ఆలోచనతో వారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసివేయడం సిగ్గుచేటు అని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు ముక్తకంఠంతో ఖండించారు.
పేరుకే ప్రజా ప్రభుత్వం కానీ ప్రశ్నించే గొంతుకలను నొక్కే ప్రయత్నం చేస్తుందని, రేవంత్ రెడ్డికి ప్రశ్న అంటే భయమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేసి ఆర్ ఎస్పీ ని టార్గెట్ చేస్తున్నాయని తెలిపారు.
ఆయనకు ఏం జరిగినా రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని, దానికి రేవంత్ రెడ్డి నేతిక బాధ్యత వహించాలని, ఆయన కు యూనివర్సిటీ విద్యార్థులం సంఘాలకు అతీతంగా అండగా ఉంటామని తెలిపారు.తిరిగి నూతన బుల్లెట్ ప్రూఫ్ వాహన సదుపాయం కల్పించాలని కోరారు. ఆర్ఎస్పీకి మద్దతుగా అన్ని యూనివర్సిటీల్లో ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయనకు మద్దతుగా ఆల్ యూనివర్సిటీస్ ఐక్య విద్యార్థి సంఘాల జాక్ గా ఏర్పడుతున్నట్లు ప్రకటించాయి.
ఈ సమావేశంలో పలు విద్యార్థి సంఘాల ప్రతినిధులు డా. వీరబాబు, గద్దల అంజిబాబు, సోమశేఖర్, ఆర్.ఎల్. మూర్తి, దర్శన్, నాగేశ్వర్ రావు, సుమంత్, అనిత ముదిరాజ్, సైదులు, వేణుగోపాల్, వేదాంత మౌర్య, అలెగ్జాండర్, అజయ్, భారీ అశోక్, రాజేష్, మధు, కాశీనాథ్, కృష్ణ, రాంచంద్రం, చిరంజీవి (స్వేరోస్), మధు అనీల్ రాజ్, నగేష్, సుధాకర్, సతీష్, ప్రసాద్, సాయి కుమార్, మొజాస్ విద్యార్థులు పాల్గొన్నారు.



