తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు, బహుజన యుద్ధనౌక డాక్టర్ ఏపూరి సోమన్
నవతెలంగాణ – తుంగతుర్తి
మహాత్మ జ్యోతిరావు పూలే, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ప్రతిష్టాపన సామాజిక చైతన్యానికి, వారి ఆశయాల సాధనకు ప్రతీకగా నిలుస్తుందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు, బహుజన యుద్ధనౌక డాక్టర్ ఏపూరి సోమన్న అన్నారు. శనివారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహనీయుల విగ్రహాలను పునః ప్రతిష్ట చేసి, మూడు రోజుల పాటు నిర్వహించే క్రీడోత్సవాలను సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు.
దేశంలో అణచివేతకు గురవుతున్న మహిళాలోకానికి అక్షర లోకాన్ని చూపించి మహిళా జ్యోతులుగా తీర్చిదిద్దిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మ జ్యోతిరావు ఫూలే అని కొనియాడారు. స్వాతంత్ర్య సమరయోధుడు, అణగారిన వర్గాల అభ్యున్నతికి కోసం పాటుపడిన సామాజిక న్యాయసాధకుడు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశాడని అన్నారు. మహనీయుల ఆలోచనలు ప్రతి ఒక్కరు ఆచరణలో పెట్టాలని, సమాజంలో ఐక్యతను పెంపొందించాలని పిలుపునిచ్చారు. సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం ఆగకూడదని పిలుపునిచ్చారు. వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిలకల మంజుల వెంకన్న, ఉప సర్పంచ్ అన్నేబోయిన శ్రీకాంత్, సభాధ్యక్షులు చింతకుంట్ల విఠల్, తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు, అరుంధతి యువజన సంఘం అధ్యక్షులు చింతకుంట్ల పరమేష్, మాజీ ఎంపీటీసీ కేతిరెడ్డి లతా విజయకుమార్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, ఏవైసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాశం అజయ్ కుమార్, గౌరవాధ్యక్షులు చింతకుంట్ల వెంకన్న(బిల్డర్), విగ్రహ నిర్వహణ కమిటీ ఉపాధ్యక్షులు మందుల నరేష్, ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల పరమేష్ (బాబు), సభ్యులు మందుల పరమేష్, చింతకుంట్ల సైదులు, మాచర్ల ఉపేందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రేగటి రవి, సుంకరి జనార్ధన్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు, యువకులు మహిళలు భారీగా హాజరై మహనీయుల సేవలను స్మరించుకున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తుంగతుర్తి సీఐ నరసింహారావు ఆధ్వర్యంలో తుంగతుర్తి మద్దిరాల ఎస్సైలు క్రాంతి కుమార్, వీరన్న లు పోలీస్ సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహించారు.



