Saturday, March 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బైరంపల్లిలో బంగారం, వెండి చోరీ 

బైరంపల్లిలో బంగారం, వెండి చోరీ 

- Advertisement -

నవతెలంగాణ – మిడ్జిల్ 
మండలంలోని బైరంపల్లి గ్రామంలో తాళం వేసిన ఇంట్లో వెండి, బంగారం రూ.4000 నగదు చోరీ అయిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి  జరిగింది. ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. బైరంపల్లి గ్రామనికి  చెందిన బండారి జయమ్మ శుక్రవారం రాత్రి  భోజనం చేసి ఇంట్లో పండుకున్నారు. శనివారం తెల్లవారుజామున ఉదయం 6 గంటలకు చూడగా ఇంట్లో ఒక గధి తలపులు తెరుచుకుని ఉన్నాయి. లోనికి వెల్లి చూడగా బీరువా తెరసి ఉండడంతో ఇంట్లో నుండి 2 తులాల వెండి ఉంగరాలు, అద్దతులం బంగారం, 14 తులాల  వెండి గొలుసులు, రూ.4000 గుర్తుతేలియని వ్యక్తులు చోరీ చేశారని జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివనాగేశ్వర్ నాయుడు చెప్పారు. ఎండాకాలంలో ప్రజలు ఆరుబయట  నిద్రించవద్దని గుర్తుతెలియని వ్యక్తులు వస్తే పోలీసులకు వెంటనే సమాచారాన్ని అందించాలని చెప్పారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -