- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లకు వరద నీరు చేరింది. మండల కేంద్రమైన తాడిచెర్లలోని ఎస్సికాలనిలోని తాండ్ర కౌసల్య అనే నిరుపేద కూలికి చెందిన పెంకుటిల్లు పూర్తిగా నేలమట్టమైయింది. అయితే కౌసల్య కుటుంబ సభ్యులు గురువారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఒకేసారి భారీగా శబ్దం రావడంతో కేకలు వేసుకుంటూ బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పిందని వాపోయారు. ఇల్లు కూలి నష్టపోయిన తమ కుటుంబాన్ని ప్రభుత్వం, అధికారులు ఆర్థికంగా ఆదుకోవాలని బాధిత కుటుంబం వేడుకొన్నారు.
- Advertisement -



