Friday, July 31, 2026
E-PAPER
Homeఖమ్మంచల్లగుళ్ల నరసింహారావును పరామర్శించిన మంత్రి తుమ్మల

చల్లగుళ్ల నరసింహారావును పరామర్శించిన మంత్రి తుమ్మల

- Advertisement -

నవతెలంగాణ-సత్తుపల్లి 
సత్తుపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహారావును తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. ఇటీవల హైదరాబాద్ ఫిలింనగర్‌లోని అపోలో ఆసుపత్రిలో చల్లగుళ్ల నరసింహారావుకు చిన్నపాటి శస్త్రచికిత్స (మైనర్ ఆపరేషన్) జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల శుక్రవారం  ఆ ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా నరసింహారావు క్షేమసమాచారాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి వైద్యులతో మాట్లాడిన మంత్రి, నరసింహారావు ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకొని, ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -