Saturday, August 1, 2026
E-PAPER
Homeజిల్లాలునవతెలంగాణ రిపోర్టర్ తండ్రి మృతికి జర్నలిస్టుల సంఘాల నేతల నివాళి

నవతెలంగాణ రిపోర్టర్ తండ్రి మృతికి జర్నలిస్టుల సంఘాల నేతల నివాళి

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన, నవతెలంగాణ దినపత్రిక కాశిబుగ్గ రిపోర్టర్ బవాండ్లపల్లి కిరణ్ తండ్రి బవాండ్లపల్లి వెంకటయ్య శనివారం ఉదయం మృతిచెందారు. ఈ సందర్భంగా నాగారంలోని వారి స్వగృహానికి చేరుకున్న పలు జర్నలిస్టుల సంఘాల నాయకులు వెంకటయ్య భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్, టీడబ్ల్యూజేఎఫ్ వరంగల్ జిల్లా కార్యదర్శి చిలువేరు శ్రీకాంత్, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాడిపెల్లి మధు, టీయూడబ్ల్యూజే-143 జిల్లా అధ్యక్షుడు, వరంగల్ తూర్పు జర్నలిస్టుల పరపతి సంఘం అధ్యక్షుడు నరేందర్ తదితరులు పాల్గొని, బవాండ్లపల్లి కిరణ్ కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వెంకటయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -