Saturday, August 1, 2026
E-PAPER
Homeఆదిలాబాద్సాంకేతిక పరిజ్ఞానంతో కేసులను మరింత వేగం

సాంకేతిక పరిజ్ఞానంతో కేసులను మరింత వేగం

- Advertisement -

జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్

సాంకేతిక పరిజ్ఞానంతో కేసులను మరింత వేగంగా పరిష్కరించే అస్కారం ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అన్నారు. ఈ-కోర్ట్స్ ప్రాజెక్టు కింద ఫేజ్ త్రీలో నేషనల్ సర్విస్ ట్రాకింగ్ ఎలక్ట్రానిక్ ప్రాసెస్ పై కోర్టు సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన ఈ శిక్షణకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి హాజరై ప్రారంభించి పలు సూచనలు, సలహలను అందించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ… ఈ-కోర్ట్స్ ప్రాజెక్టు కింద నూతన సాఫ్ట్ వేర్ ఆధారిత ప్రాజెక్టు విజయవంతంగా కొనసాగుతుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్షేత్రస్థాయిలో కేసులను త్వరగతిన పరిష్కరించడానికి అస్కారం ఉంటుందన్నారు. మారుతున్న కాలంతో పాటు సాంకేతికతను ఉపయోగించేల అందిస్తున్న శిక్షణాలను సద్వినియోగం చేసుకుంటు ఉద్యోగులు తమ ఉత్తమ ప్రతిభను కనబరచాలన్నారు. కార్యక్రమంలో ఏఓ దశరత్, మాస్టర్ ట్రైనర్లు రవి కుమార్, సాయి కుమార్ కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -