Sunday, March 22, 2026
E-PAPER
Homeఖమ్మంసాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్ రైతులకు న్యాయం చేయాలి

సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్ రైతులకు న్యాయం చేయాలి

- Advertisement -

బస్తాకు రూ. 2000 ప్రభుత్వం తక్షణ సహాయంగా అందించాలి
డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క వెంటనే స్పందించాలి 
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావ
నవతెలంగాణ – బోనకల్ 

సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్ రైతులకు తక్షణము రాష్ట్ర ప్రభుత్వం బస్తాకు రూ.2000 సహాయంగా అందించి ఆదుకోవాలని, మధిర ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దక్షిణం స్పందించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు కోరారు. ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని ఆత్కూరు గ్రామ పరిధిలోని సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్ ని ఆదివారం మధిర మండల సిపిఎం నాయకులు, బాధిత రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలకు చెందిన బాధ్యత రైతుల తమ సమస్యలను ఆయనకు వివరించారు. రైతులతో ఆయన మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు సంఘటన వివరాలను పోతినేని సుదర్శన్ రావుకు వివరించారు.

ఈ సందర్భంగా పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ మిర్చి రైతులు ఆరు కాలము కష్టపడి, శ్రమించి అనేక చీడ పీడల నుండి పంటను కాపాడుకోవడం కోసం, పురుగుమందుల కోసం, ఎరువుల కోసం అనేక చోట్ల అప్పులు చేసి, ధరలు గిట్టుబాటు కాక కోల్డ్ స్టోరేజీ నందు తమ పంటను నిల్వ చేసుకున్నారన్నారు. కానీ హఠాత్తు పరిణామాలతో సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీ లో మంటల వ్యాపించి రైతుల పంట కాలిపోవడం బాధాకరమన్నారు. ఈ అగ్ని ప్రమాదంలో తమ పంట బుగ్గిపాలు అవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. అలాంటి రైతులను తక్షణం ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రధానంగా మధిర నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క వెంటనే సానుకూలంగా స్పందించి తక్షణ సహాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని సుదర్శన్ రావు కోరారు.

ఇటువంటి సమయంలో రైతులకు నిర్దిష్ట గడువులోగా జరిగిన పంట నష్టానికి నికరంగా సహాయం అందిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం వల్ల రైతులలో కొంత ఆందోళన తగ్గించవచ్చునన్నారు. ఈ విధంగా చేయటం వలన వారికి మనోధైర్యాన్ని కల్పించినట్లు అవుతుందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం వీలైనంత త్వరగా రైతులకు సహాయం అందించే దానికోసం కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయకపోతే, ఆ న్యాయం కోసం తెలంగాణ రైతు సంఘం, సిపిఎం రైతులకు అండగా ఉండి పోరాటం నిర్వహిస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మధిర రూరల్  మండల కార్యదర్శి మందా సైదులు, పట్టణ కార్యదర్శి పడకంటి మురళి, సీనియర్ నాయకులు మందడపు ఉపేంద్ర రావు, షేక్ ఉద్దండు సాహెబ్, చావా నరేష్, రెండు రాష్ట్రాల బాధిత రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -