- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తోంది. ఈ నేపథ్యంలో మండలం ఎడ్లపల్లి గ్రామంలో పలువురు లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను శనివారం గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేల్పుల రమేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తొగరి శంకర్, అజ్మీరా శివ, వార్డు సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
- Advertisement -



