- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం వల్లెంకుంట జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో మండల విద్యాధికారి లక్ష్మణ్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన రెండవ విడత మూడు రోజుల మండల స్థాయి ఇంటిగ్రేటెడ్ ఇన్ సర్వీస్ టీచర్స్ ట్రెనింగ్ శనివారం ముగిసిందని మండల విద్యాధికారి లక్ష్మణ్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడారు విద్యార్థుల్లోని విజ్ఞానాన్ని అంచనా వేస్తూ కృత్యాధార బోధన ద్వారా ఉత్తమ ఫలితాలను సాధించాలని ఉపాధ్యాయులను కోరారు.అదేవిధంగా సులభమైన రీతిలో బోధించి విద్యాసామర్ధ్యాలను పెంపొందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎంలు సుదర్శనం,తిరుపతి,ఆర్పీలు మధుసూదన్,చంద్రశేఖర్,సాంబయ్య ,హరీష్,ఉపాధ్యాయులు,సిఆర్పిలు పాల్గొన్నారు.
- Advertisement -



