Saturday, August 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండల కేంద్రాన్ని సుందరవణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎంపీడీఓ

మండల కేంద్రాన్ని సుందరవణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండల కేంద్రంలోని సుందరవణంగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతోనే జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ శనివారం ప్రత్యేకంగా పలు వార్డులను సందర్శించడం జరిగిందని జుక్కల్ గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఇందిరమ్మ గృహాలను నిర్మిస్తున్న వాటిని పరిశీలించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా గ్రామాల్లోని పలు కాలనీలో మురికి కాలువ శుభ్రం చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరు సహకరించి చెత్తాచెదారాన్ని ప్రభుత్వం అందజేసిన డబ్బాలలో వేసుకోవాలని తెలిపారు. మురికి కాలులో పేరుకుపోయిన చెత్తాచెదారం ను గ్రామపంచాయతీ కార్మికులతో శుభ్రం చేయించారు. క్షేత్ర  స్థాయిలో జరుగుతున్న పనులను గ్రామపంచాయతీ నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను ఒక్కొక్కటిగా అడిగి జిపి కార్యదర్శి వద్వారా తెలుసుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ జీపీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -