సమస్యలపై పోరాడుదాం కదలిరండి
కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు వీరగాని మల్లేశం గౌడ్
మండల ప్రధాన కార్యదర్శి శీలం సత్యనారాయణ
నవతెలంగాణ-నెల్లికుదురు
మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల రెండవ తేదీన నిర్వహించే అమరుల యాధిలో గీతన్నల చైతన్య యాత్ర లో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కేజీ కేఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు వీరగని మల్లేశం గౌడ్, శీలం సత్యనారాయణ కోరినట్లు తెలిపారు. శనివారం మండల కేంద్రంలో సంబంధిత కరపత్రాలను ఆవిష్కరించి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర 2016 ఆగస్టు ఒకటి నుండి 16 వరకు గోల్కొండ కోటకు విజయవంతంగా నిర్వహించామని అన్నారు.
ఈనెల మూడవ తేదీన మండల కేంద్రానికి యాత్ర వస్తుందందున మండల గౌడ సంఘం నాయకులందరూ మండల కేంద్రానికి హాజరై యాత్ర విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గీతా కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రణాళికలో ప్రకటించిన విధంగా పెన్షన్ 4000 రూపాయలు ఇచ్చి 10 లక్షల ఎక్సిబిషన్ పెంచాలని రాష్ట్రంలో ఎక్కడ ప్రమాదానికి గురైన గుర్తింప చేయాలని అన్నారు. ప్రభుత్వ జీవ ప్రకారం 50 సంవత్సరాల పైబడిన మిగతా కార్మికులందరికీ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు పెండింగ్లో ఉన్న డబ్బులు 20 కోట్లు వెంటనే సంబంధిత బాధితులకు అందజేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పెరుమాండ్ల బాబు గౌడ్ పెరుమళ్ళ చంద్రమౌళి గౌడ్ బంధారపు సుధాకర్ కేరళ లక్ష్మయ్య గుండ్లపల్లి వెంకన్న బొమ్మ గాని సాంబయ్య శంకర్ గట్టు ఉపేందర్ రామచంద్రయ్య సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.



