Sunday, August 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అర్హులైన భూ నిర్వాసితులకు న్యాయం చేయండి

అర్హులైన భూ నిర్వాసితులకు న్యాయం చేయండి

- Advertisement -

సోషల్ మీడియాలో కమిటీకి నిర్వాసితుల విజ్ఞప్తి
నవతెలంగాణ – మల్హర్ రావు

తాడిచెర్ల ఓసీపీకి డేంజర్ జోన్లో ఇల్లు,భూమి కోల్పోతున్న అర్హులైన భూ నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి పరిహారం,ఆర్అండ్ ఆర్ ప్యాకేజి,పునరావాస ప్రక్రియ న్యాయబద్ధంగా,పారదర్శకంగా జరిగేలా చూడాలని ఇది ప్రతి బాధిత కుటుంబం కోరుకుంటోందని ఆదివారం సోషల్ మీడియాలో భూ నిర్వాసితుల కమిటీకి పలువురు బాధిత భూ నిర్వాసితులు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఉపరితలంలో ఇల్లు,భూమి కోల్పోయిన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందడం ఎంతో అవసరమని అయితే,గతంలోనే 49 ఇళ్ల పరిధిలో లబ్ధి పొందిన కొంతమంది పేర్లు ప్రస్తుతం సిద్ధం చేయడమే కాక (పీఎన్) ప్రిలిమినరి జాబితాలో కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గతంలో 49 ఇళ్ల కింద అర్హులుగా గుర్తింపు పొంది, పరిహారం, ఆర్అండ్ ఆర్ ప్యాకెజి, ప్రభుత్వ ప్లాట్లతోపాటు ఇందిరమ్మ ఇళ్లను సైతం ప్రయోజనం పొందిన వారికి మరోసారి అదే తరహా ప్రయోజనాలు కల్పించడం వల్ల నిజమైన అర్హులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని భావిస్తున్నారు.ఒకే కుటుంబానికి లేదా ఇప్పటికే లబ్ధి పొందిన వారికి మళ్లీ అవకాశం ఇవ్వడం వల్ల ఇంకా ఎలాంటి సహాయం అందని కుటుంబాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు.భూ నిర్వాసితుల ఉద్యమం,ఉద్దేశం ఎవరికైనా అన్యాయం చేయడం కాదు.

నిజమైన బాధితులకు న్యాయం జరగడం, ప్రభుత్వ సహాయం అర్హులకే చేరడం తమ ప్రధాన లక్ష్యం. పారదర్శకత లేకుండా ఒకే వ్యక్తులు లేదా కుటుంబాలు పలుమార్లు లబ్ధి పొందితే, ఇంకా సహాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబాల ఆశలు నిరాశాలవుతాయని వాపోతున్నారు.తాడిచెర్ల భూ నిర్వాసితుల సంఘం నాయకులు,ప్రజా ప్రతినిధులు,సంబంధిత అధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి, ఇప్పటికే లబ్ధి పొందిన వారికి మళ్లీ ప్రయోజనాలు కల్పించకుండా,నిజమైన అర్హులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -