
– మొదటి రోజు 294 దరఖాస్తులు స్వీకరణ
నవతెలంగాణ-మల్హర్ రావు : రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో మండలంలోని కొండంపేటలో 14,దుబ్బపేటలో 43,మల్లంపల్లిలో 25, చిన్నతూoడ్లలో 116,ఇప్పలపల్లిలో 42, అడ్వాలపల్లిలో 54, మొత్తం ఆరు గ్రామాల్లో 294 దరఖాస్తుల స్వీకరణ గురువారం ప్రజాపాలనలో ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు పంచాయతీ కార్యదర్శులు షురూ చేసినట్లుగా మండల ఎంపిడిఓ నరహీంహమూర్తి తెలిపారు.అయితే ఉదయం నుంచే జిపిల వద్ద ప్రజలు బారులు తీరారు.ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయబోతున్న ఆరు గ్యారంటీల పథకాలైన మహాలక్ష్మీ, రైతు భరోసా,గృహజ్యోతి,ఇందిరమ్మ ఇండ్లు,చేయూత, ఆహార భద్రత పథకాలకు దరఖాస్తులు సమర్పించారు.ఆయా గ్రామాల్లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాలను మండల స్పెషల్ అధికారి అవినాష్,ఎంపిడిఓ,తహశీల్దార్ శ్రీనివాస్, కొయ్యుర్ ఎస్ఐ నరేశ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల స్పెషల్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజలు పాల్గొన్నారు.