Monday, August 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం10న జైల్ భరోను 
జయప్రదం చేయండి

10న జైల్ భరోను 
జయప్రదం చేయండి

- Advertisement -


​ కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ 
బిల్లు 2025ను ఆపాలి
వృత్తిదారుల ఉచిత విద్యుత్ పథకాలను తొలగిస్తే ఉద్యమిస్తాం : టీఆర్ఎస్వీ 
రాష్ట్ర కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

ఆగస్టు 10న జైల్ భరోను జయప్రదం చేయలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం కమిటీ. తెలంగాణ క్షౌర వృత్తిదారుల సంఘాలు పిలుపునిచ్చాయి. హైదరాబాద్ రాంనగర్ లోని వృత్తిదారుల భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2025ను ఆపాలని డిమాండ్ చేశారు. వృత్తిదారుల ఉచిత విద్యుత్ పథకాలను తొలగిస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. విద్యుత్ సవరణ బిల్లు అమల్లోకి వస్తే చేతివృత్తిదారులు, పేదలు, బలహీన వర్గాలు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో రజక, క్షౌర, కార్పెంటర్, స్వర్ణకారులు, చేనేత,కుమ్మరి, కమ్మరి, పరుపుల తయారీదారులు, ఇటుక బట్టీలు చేసేవారితో పాటు చిన్న వృత్తులు చేసుకునే లక్షలాది మంది విద్యుత్తు సబ్సిడీపై పనులు చేసుకుంటున్నారని తెలిపారు. వారి మనుగడను బుగ్గిపాలు చేస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్ కుట్రలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్మిక కోడ్స్, వీబీ గ్రామ్‌ జీ , విత్తన బిల్లు, విద్యుత్ బిల్లు, ఆహార భద్రత చట్టం తదితర పేదల వ్యతిరేక చట్టాలను వెంటనే నిలుపుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆగస్టు 10న జరిగే దేశవ్యాప్త జైలు భరో కార్యక్రమంలో వృత్తిదారులంతా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. క్షౌర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చెన్నారం మల్లేశం మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ నగరంలో లక్ష పైన సెలూన్ షాపులు ఉన్నాయని తెలిపారు. ఆ షాపుల్లో వృత్తిదారులు ఉచిత విద్యుత్ పథకం పై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. వారి జీవితాలను నాశనం చేసే విద్యుత్ సవరణ బిల్లును ఆపాలని డిమాండ్ చేశారు. జైల్ భరో కార్యక్రమానికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ రజక వృత్తిదారుల సంఘం సిటీ కార్యదర్శి మరియాల గోపాల్, కె.యాదగిరి, మేడ్చల్ జిల్లా నాయకులు పెద్దాపురం భాస్కర్. క్షౌర వృత్తిదారుల సంఘం గ్రేటర్ నాయకులు మనోహర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -