హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్, ఎంపీలు
పట్నం కుటుంబానికి పలువురు ప్రముఖుల ప్రగాఢ సానుభూతి
నవతెలంగాణ – మొయినాబాద్
తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిల మాతృమూర్తి దివంగత పట్నం రుక్కమ్మ దశదినకర్మ ఆదివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని జేపీఎల్ కన్వెన్షన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై రుక్కమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కతో కలిసి హాజరై నివాళులర్పించారు. పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీతా మహేందర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, పట్నం అవినాష్ రెడ్డిలను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డితో కలిసి హాజరై రుక్కమ్మ చిత్రపటానికి అంజలి ఘటించారు. బీజేపీ ఎంపీలు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ తదితరులు హాజరై పట్నం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
పట్నం రుక్కమ్మకు నివాళి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



