Monday, August 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్

బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్

- Advertisement -

నవతెలంగాణ – కంది 
ఆషాఢ మాసం సందర్భంగా కంది మండలంలోని బేగంపేట గ్రామంలో సోమవారం గ్రామ సర్పంచ్ ఉమా సాయిగౌడ్ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పెద్దలు ఘన స్వాగతం పలికి శాలువాతో వారిని సత్కరించారు. అనంతరం గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ , మహిళలు, యువకులు, ఎమ్మెల్యేతో సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కాసాల బుచ్చిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, చింత సాయినాథ్, మనోహర్ గౌడ్, కృష్ణ గౌడ్,శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -