నవతెలంగాణ–పరకాల
పరకాల మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ విభాగాల సిబ్బందికి 2025–26 సంవత్సరానికి సంబంధించిన చెప్పులు, కొబ్బరి నూనెను సోమవారం పంపిణీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ పాల్గొని పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంచడంలో పారిశుద్ధ్య, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. వారి సేవలు అభినందనీయమని పేర్కొంటూ, సిబ్బంది సంక్షేమానికి అవసరమైన సౌకర్యాల కల్పనకు మున్సిపాలిటీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్. పవన్, కౌన్సిలర్ కుక్కల విజయ్ కుమార్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ కె. ప్రదీప్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ వెంకట్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



