ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
ఎంపీడీవో జయరాం నాయక్
నవతెలంగాణ-నవాబు పేట
మండల పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం మండల స్థాయి అధికారులు అందరూ హాజరై అన్ని గ్రామాల ప్రజలతో వినతులు స్వీకరిస్తారు అని, సమస్యలు ఉన్న వారు సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేసి సమస్యలను పరిష్కరించుకునేందుకు సంప్రదించాలి ఎంపీడీవో జయరాం నాయక్ సూచించారు.రెవెన్యూ సంబంధించి మూడు ఫిర్యాదు విద్యా శాఖ ఒకటి, పోలీస్ స్టేషన్ ఒకటి సంబందించి ఫిర్యాదులు అందాయి అని ఆ సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తాం అని ఎంపీడీవో జయరాం నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రతి సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసుకోవాలని పదిహేను రోజులలో పరిష్కారం అవుతుంది అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగ్య నాయక్ ఎంపీఓ బద్రు నాయక్ మెడికల్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్ నీటిపారుదల శాఖ ఇంజనీర్ శమీ ఉల్లాఖాన్ పశుసంవర్ధక శాఖ ఎక్సైజ్ శాఖ విద్యుత్ శాఖ శిశు సంక్షేమ శాఖ లో సంబంధించిన అధికారులు సూపరింటెండెంట్ గోవింద రెడ్డి ఈసీ నర్సింహ చారి తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



