Monday, August 3, 2026
E-PAPER
Homeఖమ్మంవర్షాభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

వర్షాభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

- Advertisement -

– ఏఐయూకేఎస్, ఏఐపీకేఎంఎస్ డిమాండ్
– తహసిల్దారు కార్యాలయం ఎదుట ధర్నా 
నవతెలంగాణ – సత్తుపల్లి

వర్షాభావం వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐయుకేఎస్,  ఏఐపీకేఎంఎస్ ఆధ్వర్యంలో సోమవారం సత్తుపల్లి తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసిల్దారు పున్నం సత్యనారాయణకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఏఐయూకేఎస్ కల్లూరు డివిజన్ కార్యదర్శి బీరెల్లి లాజరు, ఏఐపీకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ… వాతావరణ నిపుణులు, ప్రభుత్వ ప్రకటనలు నమ్మి రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధపడ్డారన్నారు. అయితే వర్షాలు సరిగా కురవక, వేసిన పంటలు మొలకెత్తినా వాడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

​​నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించి ఆదుకోవాలన్నారు. ప్రత్యామ్నాయ సాగుకు స్వల్పకాలిక విత్తనాలు, ఎరువులను ఉచితంగా సరఫరా చేయాలని కోరారు. రైతుల పాత రుణాలను రద్దు చేసి, కొత్తగా వడ్డీ లేని పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ​పోడు భూముల్లో ట్రాక్టర్ల వినియోగంపై ఉన్న ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలన్నారు. ఉపాధి హామీ పనుల ద్వారా రోజుకు రూ. 600 కూలీ చెల్లించి, ప్రతి కుటుంబానికి 20 కేజీల ఉచిత బియ్యం ఇవ్వాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో ఆయా  సంఘాల నాయకులు ఒగ్గు నాగిరెడ్డి, తాటి రాజు, కందిమళ్ల ప్రసాద్, కుంట కృష్ణ, మడివి వెంకటమ్మ, సున్నం కృష్ణ, గణేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -