- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద షక్కర్గ గ్రామంలో ప్రజలకు నీటి సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ విశాలాక్షి రాం పటేల్ తెలిపారు. గ్రామంలోని పలువాడాల్లో నీటి సమస్య తీర్చడానికి బోర్లు వేయిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో ఏ వార్డులో కూడా నీటి సమస్య రాకుండా ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టి బోర్లు వేయించి ప్రజలకు నీటి సమస్య తీరుస్తున్నామని తెలిపారు. మంగళవారం గ్రామంలో బోరు మోటార్ కు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విశాలాక్షి రాం పటేల్, అలాగే గ్రామస్తులు గల్లివాసులు పాల్గొన్నారు.
- Advertisement -



