సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కుర్రె మల్లేష్ యాదవ్..
నవతెలంగాణ-టేకుమట్ల
రెండు నెలలకు ఒకసారి జరిగే గ్రామ సభను సోమవారం సర్పంచ్ కుర్రె మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సోమవారం ఆరేపల్లి గ్రామంలో సర్పంచ్ కుర్రె మల్లయ్య యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో అభివృద్ధి పనుల పురోగతిని,చేపట్టవలసిన పనులను వార్డ్ మెంబర్ సమక్షంలో చర్చించారు.అంగన్వాడి సెంటర్లలో పౌష్టిక ఆహార పంపిణీ,ప్రజల ఆరోగ్య పరిస్థితిలు,మహిళల అభివృద్ధి,ప్రభుత్వ పాఠశాల పనితీరు,గ్రామ అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు.సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి చెందాలంటే వార్డ్ మెంబర్లు,సర్పంచిగా నేను కలిసి పని చేస్తేనే గ్రామాన్ని సమగ్ర అభివృద్ధిగా చేసుకోవచ్చు అన్నారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బేతి కోమల,ఉప సర్పంచ్ గురియాల మల్లారావు,వార్డు మెంబర్లు, అంగన్వాడి టీచర్లు,ఆశ వర్కర్లు,గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్రామ అభివృద్ధికి గ్రామసభ కీలకం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



