Monday, August 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ శుభ్రత పట్ల ప్రత్యేక దృష్టి: సర్పంచ్

గ్రామ శుభ్రత పట్ల ప్రత్యేక దృష్టి: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద తడగూర్ గ్రామ శుభ్రత పట్ల ఆ గ్రామ సర్పంచ్ శాంతవ్వ ఈరన్న ప్రత్యేక దృష్టి సాదిస్తున్నారు. గ్రామంలోని వాడవాడలో పెరిగిన పిచ్చి మొక్కలు గడ్డి లాంటి వాటిని తొలగించేందుకు ముందుగా పిచికారి మందు వేయించడం జరిగింది. ఆ తర్వాత వాడ వాడలోని మురికి కాలువల పక్కన ఎలాంటి దుర్గంధ వాసన రాకుండా ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ బ్లీచింగ్ పౌడర్ చల్లించే ఏర్పాట్లు చేశారు. ఆ  కార్యక్రమాన్ని సర్పంచ్ పరిశీలించారు సర్పంచ్ వెంట గ్రామ కారోబార్ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -