Tuesday, August 4, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురోబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ అరుదైన ఘనత

రోబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ అరుదైన ఘనత

- Advertisement -

వెయ్యి రోబోటిక్‌ ‌శస్ర్తచికిత్సలు పూర్తి..90 శాతానికిపైగా ఉచితంగానే సేవలు
నిమ్స్‌ వైద్య బృందానికి సీఎం, వైద్యశాఖ మంత్రి అభినందనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌/సిటీబ్యూరో1
నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) రోబోటిక్ శస్త్రచికిత్సల రంగంలో మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. రోబోటిక్ సర్జరీ సేవలను ప్రారంభించిన మూడేండ్లలోపే వెయ్యి విజయవంతమైన రోబోటిక్ శస్త్రచికిత్సలను పూర్తి చేసి ప్రభుత్వ వైద్యరంగంలో విశిష్ట గుర్తింపును సాధించింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన రోబోటిక్ శస్త్రచికిత్సలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన నిమ్స్, నాణ్యమైన వైద్యసేవలను అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ వెయ్యి శస్త్రచికిత్సల్లో యూరాలజీ విభాగం 590, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం 248, సర్జికల్ ఆంకాలజీ విభాగం 162 ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించాయి. వీటిలో ప్రోస్టేట్, మూత్రాశయం, కిడ్నీ, కాలేయం, ప్యాంక్రియాస్, పేగులు, అండాశయం, గర్భాశయం తదితర క్లిష్టమైన క్యాన్సర్, ఇతర ప్రధాన శస్త్రచికిత్సలున్నాయి. ఆ శస్త్రచికిత్సల్లో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) పథకాల ద్వారా రోగులకు పూర్తిగా ఉచితంగా నిర్వహించడం నిమ్స్ సాధించిన మరో విశేష ఘనత. ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్‌ రాహుల్ దేవరాజ్ మాట్లాడుతూ.. ఈ అరుదైన విజయానికి కృషి చేసిన యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ ఆంకాలజీ విభాగాల వైద్యులు, అనస్థీషియా నిపుణులు, నర్సింగ్ సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ బృందం, ఇతర సహాయక విభాగాల సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరింత మంది పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలను అందించేందుకు నిమ్స్ కట్టుబడి ఉంటుందని తెలిపారు.
అభినందనలు తెలిపిన సీఎం
నిమ్స్‌లో రెండున్నరేండ్లలో వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేయడంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత సాధించినందుకు నిమ్స్​ డైరెక్టర్​ రాహుల్​ దేవరాజ్​తో పాటు వైద్య, నర్సింగ్‌, ఆపరేషన్‌ ‌థియేటర్‌ ‌బృందాల కు అభినందనలు తెలిపారు. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వా స్పత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పం నెరవేరింద ని సీఎం పేర్కొన్నారు. నిమ్స్​లో ఇప్పటివరకు నిర్వహిం చిన రొబోటిక్ సర్జరీల్లో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా చేయటం ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయమని తెలిపారు. ఇటీవలే రెండు వేల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను పూర్తి చేసిన నిమ్స్, ఇప్పుడు వెయ్యి రొబోటిక్ సర్జరీల మైలురాయిని చేరుకోవటం ద్వారా కొత్త రికార్డు నెలకొల్పిందని పేర్కొన్నారు. వైద్య రంగంలో నిమ్స్ మరిన్ని మైలురాళ్లు సాధించాలని సీఎం ఆకాంక్షించారు.

నిమ్స్‌ ‌డైరెక్టర్‌ ‌రాహుల్‌ ‌దేవరాజ్‌, 
వైద్య, ఆస్పత్రి బృందాలకు అభినందనలు 
తెలిపిన మంత్రి దామోదర్‌ ‌రాజనర్సింహ
సోమవారం సచివాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహని నిమ్స్‌ ‌డైరెక్టర్‌, డాక్టర్‌ ‌రాహుల్‌ ‌దేవరాజ్‌ ‌కలిసి వెయ్యి రోబోటిక్‌ ‌శస్ర్తచికిత్సల గురించి వివరించారు. ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్‌తో పాటు రోబోటిక్ సర్జరీల్లో భాగస్వాములైన డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బందిని మంత్రి అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో నిమ్స్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. రెండువేల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు, వెయ్యి రొబోటిక్ సర్జరీల మైలురాయిని చేరుకోవడం ప్రభుత్వ వైద్యరంగ సామర్థ్యానికి నిదర్శనమని కొనియాడారు. దక్షిణ భారతదేశంలో ప్రభుత్వ రంగంలో తొలి రొబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ను విజయవంతంగా నిర్వహించిన నిమ్స్, దేశంలోనే ప్రముఖ అవయవ మార్పిడి కేంద్రాల్లో ఒకటిగా నిలిచిందని గుర్తు చేశారు. నిమ్స్‌తో పాటు ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో కూడా రొబోటిక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.

  1. ↩︎
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -