Tuesday, August 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఉద్యోగ భద్రత కమిటీని నియమించటం అభినందనీయం

ఉద్యోగ భద్రత కమిటీని నియమించటం అభినందనీయం

- Advertisement -


న్యాయంగా ఉద్యోగ భద్రత కల్పించాలి : టీఎస్‌ఆర్టీసీ ఎస్‌‌డబ్ల్యుఎఫ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ప్రభుత్వ నిర్ణయం లో భాగంగా ఆర్టీసీ లోని కార్మిక సంఘాలతో మూడు దఫాలుగా జరిగిన చర్చలలో అంగీకరించిన అంశాల అమలులో భాగంగా ఎనిమిది మంది అధికారులతో ఉద్యోగ భద్రత కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేయటం అభినందనీయమనీ, అందుకు టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యంకు టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్‌ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ధన్యవాదములు తెలి‌పింది. ఈ మేరకు సోమవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్‌ ‌రావు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగ భద్రత కమిటీలో నియమితులైన అధికారులు కార్మిక సంఘాలు ఇచ్చే వినతిపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి సిఫారసులు ఇవ్వాలని కోరారు. ఎటువంటి పక్ష పాతం లేకుండా చట్టాలు, సహజ న్యాయ సూత్రాలకు లోబడి కార్మికులకు ఉద్యోగ భద్రత కలిపించేలా సిపారసులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చర్చల సందర్బంగా ఈడీల కమిటీ తెలిపినట్టు అధికారుల సిఫారసులను యూనియన్ నాయకులకు ఇవ్వాలని కోరారు. వారు తెలిపిన అభ్యంతరాలను పరిశీలన చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్మిక సంఘాలతో ఉద్యోగ భద్రత కమిటీ చర్చించిన తర్వాతే తుది రూపం ఇవ్వాలని కోరారు.

మిగిలిన అంశాలు వెంటనే అమలుకు చేయాలి
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఆర్టీసీ సమస్యలు పై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమిటీ జరిపిన చర్చల్లో అంగీకరించిన అంశాలు అమలు చేయాలని ఎస్‌‌డబ్ల్యుఎఫ్‌ ‌కోరింది. ఈ మేరకు కమిటీ కన్వీనర్‌, చై‌ర్మెన్, టీజీఆర్టీసీ వైస్ అండ్‌ చైర్మన్, ఎండీని కలిసి విజ్ఞప్తి చేసింది. సమస్య ముందుకు కదలనందున సంబంధిత మంత్రి పొన్నం ప్రభాకర్ ని కల్సి వినతిపత్రం సమర్పించింది.
అంగీకరించిన అంశాలలో- 80శాతం అలవెన్సుల పెంపు, బ్రెడ్ విన్నర్ స్కీంలో వారిని రెగ్యులర్ చేయడం, డిపార్ట్‌ ‌మెంట్ పరిక్ష రాసిన వారికి జూనియర్ అసిస్టెంట్ పోస్టింగ్ లు ఇవ్వడం, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపులు వంటి వాటిని ఆగష్టు 12 న జరుగనున్న బోర్డు మీటింగ్ లో ఎజెండా గా పెట్టి చర్చించాలని కోరారు. వాటిపై వెంటనే సర్క్యూలర్ లు విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -