నవతెలంగాణ – చండూరు
చండూరు మండలం ఉపసర్పంచ్ లో ఫోరం అధ్యక్షులుగా సరికొండ ముత్యాలు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చండూరు మండల పరిధిలోని బోడంగిపర్తి గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ సరికొండ ముత్యాలు గౌడ్ ను చండూరు మండల పరిధిలోని 19 గ్రామ పంచాయతీలకు చెందిన ఉప సర్పంచ్లు అందరు కలిసి సోమవారం ఆయనను చండూరు మండలం ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా ఎండి మహమ్మద్ (బంగారుగడ్డ), ఉపాధ్యక్షులుగా కామిశెట్టి రమణ (సిరిదేపల్లి), ప్రధాన కార్యదర్శి తిప్పర్తి రాములు (ధోని పాముల), సహాయ కార్యదర్శి సిహెచ్ ఉషయ్య (పుల్లెంల), కోశాధికారి టేకుల వినోద్ రెడ్డి (గుండ్రపల్లి) లలో మండల కమిటీగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా 11 ముత్యాల గౌడ్ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధితో పాటు ఉపసర్పంచ్ ల హక్కుల గురించి పోరాడుతానని అన్నారు. ఈ సందర్భంగా నన్ను చండూరు మండలం ఉపసర్పంచ్ లకు ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
ఉప సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడిగా సరికొండ ముత్యాల గౌడ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



