కాటారం ఆర్డీఓకు సర్పంచ్ బండి స్వామి వినతి
నవతెలంగాణ – మల్హర్ రావు
తాడిచెర్ల ఓసీపీకి డేంజర్ జోన్లో టిఎస్ జెన్కో ఆధ్వర్యంలో కొనసాగుతున్న భూసేకరణ ప్రక్రియలో భూ నిర్వాసితులందరికి న్యాయం జరిగేలా చూడాలని గ్రామ సర్పంచ్ బండి స్వామి మంగళవారం కాటారం ఆర్డీఓకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గ్రామంలో పూర్వం నుంచి తాతలు, తండ్రులు, కొడుకులు, మనవులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కౌలు రైతులు, ఉపాది కూలీలు, వ్యవసాయ కూలీలు, వివిధ వృత్తుల్లో ఉన్న కార్మికులు, బతుకుదెరువు కోసం వలస వెళ్లిన కుటుంబాలు, యచకులు, నిరుపేదలు, వలస కూలీలు, అద్దె ఇండ్లలో నివసిస్తున్న కుటుంబాలకు, జీపీ రికార్డుల్లో లేని ఇండ్ల కుటుంబాలకు, వివిధ వృత్తులను నమ్ముకొని జీవిస్తున్న కుటుంబాలకు ప్రథమ పౌరునిగా వారికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యతగా తనపై ఉన్న నేపథ్యంలో కాటారం రెవెన్యూ డివిజన్ అధికారికి విజ్ఞప్తి చేయడం జరిగిందని తెలిపారు.
భూసేకరణ ప్రక్రియలో నిర్వాసితులందరికి న్యాయం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



