Tuesday, August 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

- Advertisement -

ఎడ్లపల్లి సర్పంచ్ జంగిడి శ్రీనివాస్
నవతెలంగాణ – మల్హర్ రావు

గ్రామాభివృద్ధి తమవంతుగా ఎప్పటికప్పుడు సలహాలు,సూచనలు చేస్తూ ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం సర్పంచ్ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి గ్రామసభ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ హాజరై మాట్లాడారు గ్రామంలో నెలకొన్న పలు సమస్యలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

వానాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు పరిశుభ్రత పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వార్డుల్లో పారిశుద్ధ్య చర్యలు ఎప్పటికప్పుడు చేపట్టాలని జీపీ సిబ్బందిని ఆదేశించారు.వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.గ్రామాభివృద్ధికి అధికారులు,వార్డు సభ్యులు,ప్రజలు ప్రణాలికలు తయారు చేసే క్రమంలో సలహాలు,సూచనలు సంయుక్తంగా ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్,వార్డు సభ్యులు,వివిధ శాఖల అధికారులు,సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -