Tuesday, August 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లెంకలపల్లిలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు 

లెంకలపల్లిలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
మండలంలోని లెంకలపల్లి గ్రామంలో మంగళవారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.తల్లిపాల అమృతంతో సమానం అని “తల్లిపాలు బిడ్డకు తొలి టీకా” శిశువు పుట్టిన గంటలోపు ముర్రుపాలు పట్టడం వల్ల బిడ్డకు అవసరమైన అన్ని పోషకాలు,రోగనిరోధక శక్తి పెరిగి,నవజాత శిశువులకు వచ్చే ఎన్నో ఇన్ఫెక్షన్లు,వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని మహిళలకు,బాలింతలకు అవగాహన కల్పించారు.

బిడ్డ పుట్టినప్పటి నుంచి కనీసం ఆరు నెలల పాటు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని,తల్లిపాలు కేవలం బిడ్డకు మాత్రమే కాదు,తల్లుల ఆరోగ్యానికి కూడా ఎంతో అవసరం అని,బిడ్డకు పాలివ్వడం వల్ల ప్రసవం తర్వాత తల్లి గర్భాశయం పూర్వస్థితికి చేరుకుంటుందని,రొమ్ము క్యాన్సర్,అండాశయ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని వివరించారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ వైష్ణవి,గ్రామ సర్పంచ్ అయితగోని పద్మ వెంకటయ్య గౌడ్,ఉపసర్పంచ్ మేతరి శంకర్,అంగన్వాడి టీచర్లు అయితగోని అండాలు,చాపల పద్మ, ఆశా వర్కర్లు ఏర్పుల పద్మ, సైదాబీ,గ్రామ మహిళలు,బాలింతలు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -