Tuesday, August 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బిడ్డకు తల్లిపాలు ఎంతో శ్రేయస్కారం

బిడ్డకు తల్లిపాలు ఎంతో శ్రేయస్కారం

- Advertisement -

నవతెలంగాణ – తొగుట 
బిడ్డకు తల్లిపాలు ఎంతో శ్రేయస్కారమని సర్పంచ్ పాగాల శోభ కొండల్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పుట్టిన బిడ్డకు వెంటనే ముర్రుపాలు పట్టాలని సూచించారు. అనంతరం ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. ముర్రుపాలు పట్టడంతో బిడ్డ కు బలమైన పోషకాలు అందుతాయని అన్నారు. గర్భిణీలు బాలింతలు క్రమం తప్పకుండా వైద్యుల సలహాలు పాటిస్తూ పోషకాహారం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు అనిత మాధవి, గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -