Wednesday, March 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేయాలని వినతి…

మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేయాలని వినతి…

- Advertisement -

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్  : మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి,  45 రోజులు గడిచాయని వెంటనే   మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ బి ఆర్ఎస్ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు  కలెక్టరేట్ ఏవో అంజిరెడ్డికి వినతిపత్రం అందజేశారు.  ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ   నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు ఆయా వార్డుల సమస్యలు కౌన్సిల్కు తెలియజేసి, వాటి పరిష్కారానికి మార్గం చూడవలసి ఉన్నందున వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని, భువనగిరి పట్టణంలో ఉన్నటువంటి మహిళ స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా అందుతున్న రుణాలను కొంతమంది బ్యాంకు ఉద్యోగులు, మెప్మా అధికారులు, ఆర్పీలు దుర్వినియోగం చేసిన దానిపై సమగ్ర విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఏ వి కిరణ్ కుమార్, రచ్చ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు కౌన్సిలర్ లు చెన్న స్వాతి మహేష్, నాకోటి నగేష్, చీమల రాజు యాదవ్, ఏలే భువనేశ్వరి శివ, తాడూరు బిక్షపతి, తాడెం రాజశేఖర్, నువ్వుల సుధాకర్, సుభాష్, సైదులు, మధు లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -