నవతెలంగాణ – తొగుట
గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని సర్పంచ్ పన్యాల ప్రవీణ్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పెద్ద మసాన్ పల్లి గ్రామ పంచాయతి పరిధిలో మధిర గ్రామం ఇందిరానగర్ ప్రాథమిక పాఠశాలకు ఎంజిఎన్ఆర్ ఈజిఎస్ రూ. 10 లక్షల నిధులతో ప్రహరీ గోడ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. పెద్దచెరువు కట్టకు ఈత మొక్కలు నాటారు. ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణంలో స్వచ్చ భారత్ మిషన్ నిధులతో సామూహిక మరుగుదొడ్ల సముదయానికి భూమి పూజ చేశారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పంచాయతీ అభి వృద్ధి ప్రణాళిక కోసం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి గ్రామ అభివృద్ధి కోసం అందరు కలిసి కట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. అందరు కలిసి గ్రామానికి మంచి పనులు చేసేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బోయిని శ్రీనివాస్, వార్డు సభ్యులు, పలువురు గ్రామ కుల సంఘాల నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా: సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



