Wednesday, August 5, 2026
E-PAPER
Homeఆదిలాబాద్సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ బిట్ల పెర్సిస్ 

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ బిట్ల పెర్సిస్ 

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్ 
సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ముధోల్ ఎస్సై బిట్ల పెర్సిస్ అన్నారు. సైబర్ జాగృతి దివస్, నారీశక్తి కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ కేంద్రమైన ముధోల్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో బుధవారం విద్యార్థినులకు సైబర్ భద్రత, మహిళల భద్రత, ఆన్‌లైన్ మోసాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడారు. సైబర్ నేరాల పట్ల విద్యార్థులు తమ తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలని సూచించారు. అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు, బ్యాంకు సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని తెలిపారు. సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, ఏవైనా సైబర్ మోసాలు జరిగిన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. విద్యార్థులు పాఠశాలలో ఏదైనా సమస్య తలెత్తిన వెంటనే తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ ఓ పరానా బేగం, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -