169 రైళ్లల్లో పట్టుబడ్డ186 మంది
నవతెలంగాణహ-హైదరాబాద్
దక్షిణ మధ్య రైల్వే వాణిజ్య విభాగం పరిధిలోని హైదరాబాద్ నాందేడ్ డివిజన్లలో ఈనెల మూడున భారీగా టికెట్ తనిఖీలు చేపట్టారు. గత సోమవారం రోజంతా జరిగిన ఈ డ్రైవ్లో186 మంది టికెట్ తనిఖీ సిబ్బంది పాల్గొని 169 రైళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. టికెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికులు, అనధికారంగా ప్రయాణించేవారు, బుక్ చేయని లగేజీని తీసుకువెళ్లే ప్రయాణికులను గుర్తించడంపై ఈ తనిఖీల్లో ప్రధానంగా దృష్టి సారించారు. రైల్వే ప్రాంగణంలో ధూమపానం చేసే ప్రయాణికులు, రైల్వే ప్రాంగణంలో చెత్త వేసేవారు అనధికారికంగా వస్తువులు అమ్మడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారికి జరిమానా విధించారు. ఈ డ్రైవ్లో భాగంగా, టిక్కెట్టు లేకుండా, అనధికారంగా ప్రయాణిస్తున్న 4121 మంది ప్రయాణికులను గుర్తించి, టిక్కెట్టు తనిఖీ ద్వారా రూ. 30.53 లక్షల ఆదాయాన్ని చేశారు. అదనంగా, చెత్త వేసినందుకు 35 మంది ప్రయాణికులకు రూ. 7300 జరిమానా విధించారు. అలాగే, రైల్వే ప్రాంగణంలో అనుమతి లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న 19 మంది వ్యాపారులపై చర్యలు తీసుకుని, రూ.38,000 జరిమానా ధూమపానం చేస్తున్న ఇద్దరు ప్రయాణికులకు రూ. 4000 జరిమానా విధించారు.ఈ డ్రైవ్ సందర్భంగా, టికెట్ తనిఖీ సిబ్బంది వివిధ ఉల్లంఘనలకు విధించే జరిమానాల గురించి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. రైళ్లతోపాటు రైల్వే ప్రాంగణాలలో ధూమపానం చేయడం వల్ల కలిగే అగ్ని ప్రమాదాల గురించి కూడా ప్రయాణికులకు వివరించారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, విస్తృతమైన టికెట్ తనిఖీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంతోపాటు జరిమానాల గురించి ప్రయాణికులలో అవగాహన కల్పించినందుకు వాణిజ్య విభాగాన్ని ప్రశంసించారు. రైల్వేలో టికెట్ తనిఖీ కీలక పాత్ర పోషిస్తుందనీ, ఇది టికెట్ లేని, అనధికారిక ప్రయాణాలను అరికట్టడంలో, నిజమైన ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాలను అందించడంలో ఉపయోగపడుతుందన్నారు.
దక్షిణ మధ్య రైల్వే జోన్ వ్యాప్తంగా టికెట్ తనిఖీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



