Thursday, August 6, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఏపీ ప్రయోజనాల కోసమే జీఆర్‌ఎంబీ సమావేశం

ఏపీ ప్రయోజనాల కోసమే జీఆర్‌ఎంబీ సమావేశం

- Advertisement -

తెలంగాణ జలాలను శాశ్వతంగా సమాధి చేసే కుట్ర
నీటి హక్కులను కాలరాస్తుంటే సీఎం ఎందుకు
మాట్లాడ్డం లేదు :మాజీమంత్రి హరీశ్‌‌రావు ప్రశ్న

నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
ఈనెల 18న హైదరాబాద్ వేదికగా ‌జరిగే గోదావరి రివర్‌ ‌మేనేజ్‌‌మెంట్‌ ‌బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశం ఏపీ ప్రయోజనాల కోసమే జరుగుతుందా?అనే అనుమానా లు కలుగుతున్నాయని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌‌రావు విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తేడా లేద‌ని స్పష్టమైంద‌న్నారు. ముంపులోనూ 50 శాతం న‌దీ గ‌ర్భం (రివ‌ర్ బెడ్‌)లోనే ఉంటుంద‌ని కేంద్ర మంత్రి పాటిల్‌కు సీఎం వివ‌రించారు. 148 మీట‌ర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం చేప‌డితే గ్రావిటీ ద్వారా కావాల్సినంత నీరు స‌ర‌ఫ‌రా చేయ‌లేమ‌నందున 150 నుంచి 152 మీట‌ర్ల ఎత్తులో జీఆర్‌ఎంబీ సమావేశానికి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు చెరో ఎజెండాను సిద్ధం చేసుకున్నాయని అన్నారు. ఎజెండా వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా తెలంగాణ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమని చెప్పారు. ఏపీ ప్రతిపాదించిన అంశాలను చూస్తే తెలంగాణ ఆత్మగౌరవం ఉన్న ప్రతి ఒక్కరి కడుపు మండక మానదనీ, రక్తం మరిగిపోక తప్పదని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే కుట్రలను పటాపంచలు చేయాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ నీటి ప్రయోజనాలను గంపగుత్తగా ఏపీకి తాకట్టు పెట్టాలని చూస్తున్నారా?అని సూటిగా అడిగారు. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణకు ద్రోహం చేయాలని చూస్తుంటే రేవంత్ రెడ్డి రక్తం ఎందుకు మరగడం లేదన్నారు.

తెలంగాణకు ఆత్మగౌరవం లేదా? గురుదక్షిణ కోసమే ఈ మౌనం వహిస్తున్నారా?అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై అడ్డగోలుగా మాట్లాడే రేవంత్ రెడ్డి తెలంగాణ నీటి హక్కులను ఏపీ కాలరాస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. చంద్రబాబు విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. ఆయనంటే అంత భయమా?అని అన్నారు. తెలంగాణ జల ప్రయోజనాలను శాశ్వతంగా సమాధి చేసే విధంగా ఏపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టులను ఎప్పుడూ వ్యతిరేకించలేదని చంద్రబాబు పదేపదే చెబుతారు కానీ జీఆర్ఎంబీ ముందు పెట్టిన ఎజెండా చూస్తే అసలు నిజం ఏంటో అర్థమవుతుందని చెప్పారు. కాళేశ్వరం, చౌటుపల్లి హన్మంతరావు, చిన్న కాళేశ్వరం, చనాకా-కొరటా, మోదికుంట వాగు, కడెం గూడెం లిఫ్ట్, సీతారామ లిఫ్ట్ వంటి ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులను నిలిపేయాలనీ, వాటిని పునఃసమీక్షించాలని ఏపీ కోరుతోందని వివరించారు. సమ్మక్క బ్యారేజీకి సంబంధించిన అనుమతులను కూడా నిలిపేయాలని ఏపీ ప్రతిపాదిస్తోందని అన్నారు. ఆ ప్రతిపాదనను జీఆర్ఎంబీ ఎజెండాలో చేర్చడం అత్యంత దుర్మార్గమని చెప్పారు. రాష్ట్రానికి చెందిన ఏడు కీలక ప్రాజెక్టుల అనుమతులను నిలిపేయాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. తెలంగాణ ఇంజినీర్లు ఏం చేస్తున్నారని అడిగారు. ఇప్పటికే అనుమతులు సాధించిన ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు.

383 టీఎంసీల గోదావరి జలాలకు బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అనుమతులు సాధించిందనీ, ఇప్పుడు ఆ అనుమతులను రద్దు చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందని అడిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త ప్రాజెక్టుకూ అనుమతి సాధించలేదని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి, మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణ గొంతు కోస్తున్నాయనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయని విమర్శించారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. బీజేపీ ఇప్పటికైనా స్పందించాలనీ, లేదంటే తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతారా? లేదా?అనేది బీజేపీ స్పష్టం చేయాలని డిమాండ్‌ ‌చేశారు. సమ్మక్క బ్యారేజీకి ఉరి వేసే కుట్ర జరుగుతోందన్నారు. ముగ్గురు ముఖ్యమంత్రుల సమావేశంలో సమ్మక్క సాగర్‌కు కేటాయించిన 47 టీఎంసీల నీటి వాటాను వదులుకునేందుకు రేవంత్ రెడ్డి ఒప్పుకుంటున్నారా?అని ప్రశ్నించారు. దీనిపై ఆయన తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. జీఆర్‌ఎంబీ సమావేశంలోని ఈ ఎజెండాను వెంటనే రద్దు చేయాలని కోరారు. తెలంగాణ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై పోరాటం చేయాలని సూచించారు.

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదనీ, ఆ ప్రాజెక్టు అంశాన్ని జీఆర్ఎంబీ ఎజెండాలో ఎందుకు పెట్టించలేదని ప్రశ్నించారు. బనకచర్ల విషయంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందా?అని నిలదీశారు. తెలంగాణకు 968 టీఎంసీల కేటాయింపు లేదంటూ జీఆర్ఎంబీ ఎజెండాలో ఏపీ పేర్కొనడం అత్యంత ప్రమాదకరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలో తెలంగాణకు 968 టీఎంసీల కేటాయింపు ఉందని గుర్తు చేశారు. తొమ్మిదో జీఆర్ఎంబీ సమావేశంలో కూడా తెలంగాణకు 968 టీఎంసీల హక్కు ఉందనే అంశం ఉందన్నారు. తెలంగాణ నీటి హక్కులపై 
రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. తెలంగాణ నీళ్లను లాక్కోవడానికి చేసే ప్రతి ప్రయత్నాన్ని బీఆర్ఎస్ అడ్డుకుంటుందని హెచ్చరించారు. తెలంగాణ నీటి హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ రవీందర్ రావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -